దీపావళి టపాసుల వీడియో తొలగింపు వివాదంపై దియా మిర్జాపై మేయర్ ఫైర్

రిపోర్టర్: రాజేష్ స్థలం: Mumbai

దీపావళి టపాసులకు వ్యతిరేకంగా నటి దియా మిర్జా చేసిన వీడియోను బీజేపీ నేతల అభ్యంతరంతో ముంబై నగరపాలక సంస్థ తొలగించడం రాజకీయంగా కలకలం రేపింది. ఈ వివాదంపై ముంబై మేయర్ రుతు తావ్డే తీవ్రంగా స్పందించారు. నటి దియా మిర్జాకు వ్యతిరేకంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని అవలంబించే వారికి నగరపాలక సంస్థ వేదికలపై చోటు ఇవ్వబోమని, ఆమెపై తగిన చర్యలు తీసుకుంటామని మేయర్ రుతు తావ్డే స్పష్టం చేశారు.