తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన కేసీఆర్ ఘనత అజరామరం
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ ఆదేశాల మేరకు వర్ధన్నపేట మండలం రామోజీ కుమ్మరిగూడెం తండాలో కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేసి జెండా ఆవిష్కరించారు. 2018లో 500 ఓటర్లు దాటిన ప్రతి తండాను గ్రామపంచాయతీగా మారుస్తూ జీవో జారీ చేసిన ఘనత కేసీఆర్ దని, పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తూల్ల కుమారస్వామి, గోధుమల మధుసూదన్, మార్గం బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.