ఈవీఎంలపై కాంగ్రెస్ వైఖరి సిగ్గుచేటంటూ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు మండిపాటు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలను పొగడడం, ఓడిపోతే విమర్శించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మండిపడ్డారు. హైదరాబాద్లో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈవీఎంలపై అనుమానాలు ఉంటే సీఎం రేవంత్ రెడ్డి సహా ఆ పార్టీ ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. చొరబాటుదారుల ఓట్లను తొలగిస్తుంటే కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.