ప్రయాణికులకు తీపి కబురు: వందేభారత్ స్లీపర్ రైళ్లలో ప్రత్యేక పెట్ బాక్స్
రిపోర్టర్: సునీల్
స్థలం: న్యూఢిల్లీ
పెంపుడు జంతువులతో సుదూర ప్రయాణాలు చేసే ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త తరహా వందేభారత్ స్లీపర్ రైళ్ల డిజైన్లలో ప్రత్యేకంగా పెట్ బాక్స్ వసతిని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ నూతన విధానం ద్వారా పెంపుడు కుక్కలను సురక్షితంగా రవాణా చేసేందుకు ప్రత్యేక బోనుల ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.