అమెరికాలో గ్రాండ్ ట్యాగ్స్ స్పోర్ట్స్ ఫెస్ట్: క్రీడా లోకంలో సందడి

రిపోర్టర్: రమేష్ స్థలం: శాక్రామెంటో

అమెరికాలోని శాక్రామెంటో పరిసర ప్రాంతాలలో తెలుగు ప్రవాసుల కోసం గ్రేటర్ శాక్రామెంటో తెలుగు సంఘం ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్, త్రోబాల్ పోటీలు జరగనున్నాయి. క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు కలిసి ఆడదాం కలసి గెలుద్దాం నినాదంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల క్రీడాకారులు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు వెల్లడించారు.