ఆర్టీఐ టీమ్ ఫిర్యాదుతో కమటం గూడెంలో వేగంగా కదిలిన అధికార యంత్రాంగం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట మండలం కమటం గూడెం గ్రామంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 6న జిల్లా కలెక్టర్ కు ఆర్టీఐ టీమ్ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన అధికారులు గ్రామానికి వచ్చి ప్రజలతో సమావేశమయ్యారు. అనంతరం గ్రామమంతా పర్యటించి వివిధ సమస్యలను పరిశీలించారు. మరో రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించనున్నట్లు ఆర్టీఐ టీమ్ కు చెందిన ముధాం మల్లేశం తెలిపారు.