యెమెన్లో ఉద్రిక్తత: మಾರಿబ్ వైపు హౌతీ రెబల్స్ దూకుడు
రిపోర్టర్: గోపి
స్థలం: World
యెమెన్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. సనా తూర్పు ప్రాంతంలో హౌతీ అనుకూల తెగలు భారీగా మోహరించాయి. మಾರಿబ్ ప్రాంతంపైకి దండెళ్లేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఎర్ర సముద్ర తీర ప్రాంతాలను ఆక్రమించిన హౌతీలు, ఇప్పుడు చమురు నిల్వలున్న కీలకమైన మಾರಿబ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. మరోవైపు సౌదీ మద్దతు ఉన్న ప్రభుత్వ బలగాలు వైమానిక దాడులతో దీటుగా స్పందిస్తున్నాయి. ఈ పరిణామంతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ భయాలు అలుముకున్నాయి.