సింటా కార్యాలయంలో వివాదం, పత్రాల తరలింపుపై కునికా సదానంద్ ఆవేదన

రిపోర్టర్: మహేష్ స్థలం: Maharashtra

సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యాలయంలో పత్రాల తరలింపు వివాదంపై నటి కునికా సదానంద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో గత కమిటీ అనధికారికంగా పత్రాలను తరలిస్తోందని ఆరోపించారు. ఎఫ్‌డబ్ల్యుఐఈ సభ్యులు అప్రమత్తమై ఆ వాహనాన్ని అడ్డుకుని మళ్లీ కార్యాలయంలో పత్రాలు భద్రపరిచారని, గత 40 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.