అన్నమయ్య జిల్లాలో దారుణం: లాడ్జిలో భార్యను గొంతు కోసి చంపిన భర్త

రిపోర్టర్: విజయ్ స్థలం: మదనపల్లె

అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో నవీద్ భాష తన భార్య రూబియా తాజ్ను దారుణంగా హత్య చేసినట్లు సీఐ మోహన్ కుమార్ తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వెల్లడించారు. హత్య అనంతరం నవీద్ భాష నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.