తీవ్ర తుపానుగా మురసు: నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను తీవ్ర తుపానుగా బలపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము సమయంలో నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశముందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.