వరంగల్ మామునూరు విమానాశ్రయానికి తగిన పేరు సూచించాలన్న సీఎం రేవంత్ రెడ్డి

రిపోర్టర్: సునీల్ స్థలం: వరంగల్

చారిత్రక వరంగల్ నగర విమానాశ్రయ కల త్వరలోనే సాకారం కాబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. నూతనంగా రూపుదిద్దుకుంటున్న మామునూరు విమానాశ్రయానికి తగిన పేరును సూచించాల్సిందిగా ఎక్స్ వేదికగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు పక్కనబెట్టిన ఈ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు రూ. 295 కోట్లతో భూసేకరణ పూర్తి చేసి, భూమిని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించినట్లు ఆయన స్పష్టం చేశారు.