పుట్టపర్తిలో ఆదర్శ వివాహం: పెళ్లి బట్టలతో వచ్చి ఓటు వేసిన నవ దంపతులు
రిపోర్టర్: సురేష్
స్థలం: పుట్టపర్తి
జీవితంలో అత్యంత కీలకమైన వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే నవ దంపతులు తమ పౌర బాధ్యతను చాటుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పురపాలక ఎన్నికల పోలింగ్ లో పెళ్లి పీటల మీద నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఈ వధూవరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెళ్లి వస్త్రాలతో బూత్‌లోకి అడుగుపెట్టిన వారిని చూసి అధికారులతో పాటు తోటి ఓటర్లు అభినందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్ కు మొదటి కర్తవ్యమని నవ దంపతులు తెలిపారు.