నీట్లో మెడికల్ ఫ్రీ సీట్ సాధించిన విద్యార్థిని హిమబిందు
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేటకు చెందిన దాసరి హిమబిందు నీట్ పరీక్షలో 600వ ర్యాంకు సాధించి వరంగల్ కేఎంసీలో మెడికల్ ఫ్రీ సీటును కైవసం చేసుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఆమెను, తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని, హిమబిందు భవిష్యత్తులో ఉత్తమ వైద్యురాలిగా సమాజానికి సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.