గురుగ్రామ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు కూలీలు మృతి
రిపోర్టర్: మహేష్
స్థలం: హర్యానా
హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లోని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు డివైడర్ వద్ద పనులు చేస్తున్న కూలీల పైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రామ్ చౌక్ సమీపంలో ఎస్డీ కన్‌స్ట్రక్షన్ ఆధ్వర్యంలో రైలింగ్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బిజేంద్ర సింగ్, ఓంప్రకాష్, సతీష్ చంద్ ప్రాణాలు కోల్పోగా, దిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి వేదాన్ కన్నా నడుపుతున్న కారే ఈ ప్రమాదానికి కారణమని బాజ్‌ఘేరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.