ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రి ఆనం
రిపోర్టర్: శివ
స్థలం: ఆత్మకూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తాము ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పట్టణంలో సెంట్రల్ డివైడర్లు, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించనున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా అందించే లక్ష్యంతో పనులు వేగవంతం చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.