నెల్లూరులో ఆర్టీసీ బస్సుల రద్దు: ప్రయాణికుల తీవ్ర అవస్థలు

రిపోర్టర్: రాము స్థలం: నెల్లూరు

ఎన్నికల విధులకు ఆర్టీసీ బస్సులను కేటాయించడంతో నెల్లూరు జిల్లాలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆర్టీసి అధికారులు తెలిపారు. రీజియన్ లోని మొత్తం బస్సుల్ లో సగానికి పైగా ఎన్నికల సిబ్బంది తరలింపునకు మళ్లించడంతో పల్లెవెలుగు సర్వీసులు రద్దయ్యాయి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు రాకపోకలు సాగించలేక తీవ్ర అవస్థలు పడుతున్నారని, ప్రత్యేక బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.