ముంబైలో గణేష్ మండపం వద్ద విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి
రిపోర్టర్: వెంకట్
స్థలం: ముంబై
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని లాల్‌బాగ్ సమీపంలో ఉన్న కాలచౌకి ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున గణేష్ మండపం వద్ద జరిగిన విద్యుత్ షాక్ ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలిక రాఘణి ఘన్‌శ్యామ్ యాదవ్‌తో సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరో నలుగురు భక్తులు తీవ్రంగా గాయపడటంతో ఉత్సవాల వేళ స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.