గ్రామీణ వికాసంలో యువత భాగస్వామ్యం కావాలని మంత్రి సంధ్యారాణి పిలుపు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: సాలూరు

సాలూరులో జరిగిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతతో ముఖాముఖి నిర్వహించారు. జెన్‌జీ యువత ఉన్నతంగా ఆలోచిస్తూ విలువలతో జీవించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా యువత చొరవ తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు వెళ్తోందని మంత్రి స్పష్టం చేశారు.