అమరావతి అసెంబ్లీ స్పైర్ నిర్మాణానికి రూ.661 కోట్లు కేటాయింపు
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
అమరావతిలో కొత్తగా నిర్మించనున్న ఐకానిక్ అసెంబ్లీ భవనం మధ్యలో స్పైర్ నిర్మాణానికి రూ.661 కోట్లు ఖర్చు కానుందని మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ మేరకు టెండర్లు పిలిచేందుకు సీఆర్డీఏకి ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపిందని ఆయన స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.