దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటుకు ప్రభుత్వ ఒప్పందం

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో దుగరాజపట్నంలో షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌ అభివృద్ధికి మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా 45 వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య తదితరులు పాల్గొన్నారు.