మణిపూర్లో ఘోర హింస: సీఎం రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్
రిపోర్టర్: రాము
స్థలం: న్యూఢిల్లీ
మణిపూర్లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మణిపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సప్తగిరి ఉలక తెలిపారు. రాష్ట్రంలో హింసకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ తక్షణమే రాజీనామా చేయాలని, అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పౌరుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రక్తపాతాన్ని నివారించాలని కాంగ్రెస్ నాయకులు కోరారు.