షాకింగ్ ఘటన: కారులో వివాహిత అనుమానాస్పద మృతి కలకలం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Adibhatla

ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత స్నేహ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తన కుమార్తె మృతికి భర్త శ్యామ్ సుందర్ రెడ్డి కారణమని మృతురాలి తండ్రి ముదిరెడ్డి లక్ష్మారెడ్డి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కుటుంబ కలహాలు, వేధింపుల కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయిందని తండ్రి ఆరోపించగా, అపార్ట్మెంట్ పార్కింగ్ స్థలంలోని కారులో శవం లభించడం తీవ్ర కలకలం రేపింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.