మహాలయ అమావాస్య వేళ గోసేవ: ఖమ్మంలో పశుగ్రాసం పంపిణీ చేసిన సమితి

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

మహాలయ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం నగరంలో శ్రీ స్తంభాద్రి సేవా సమితి ఆధ్వర్యంలో బృహత్తర గోసేవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గోశాలల మూగజీవాల కోసం రూ.82 వేల విలువైన పశుదాణా, పచ్చిగడ్డిని పంపిణీ చేశారు. గొల్లగూడెం శ్రీకృష్ణ గోశాలకు 68 వేలు, టేకులపల్లికి 11 వేలు, మూడో పట్టణ గోశాలకు 3 వేల విలువైన దాణా అందజేశారు. కన్వీనర్ తూములూరి లక్ష్మీ నరసింహారావు పాల్గొని అందరూ గోసంరక్షణ బాధ్యతను చేపట్టాలని పిలుపునిచ్చారు.