పల్లెర్లలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామంలో మిశ్రమ చేనేత సహకార సంఘ సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. సంఘ అధ్యక్షులు పొడుగు వెంకటేశం పతాకాన్ని ఆవిష్కరించి, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని, ఆయనకు భారత రత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు.