అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన మైలురాయిని అందుకున్న పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజామ్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Rawalpindi
అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ అరుదైన ఘనత సాధించారు. శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో పదహారు వేల పరుగుల మైలురాయిని అధిగమించారు. ఈ ఘనత సాధించిన ఐదో పాకిస్థాన్ బ్యాటర్‌గా బాబర్ ఆజామ్ నిలిచారని క్రీడా వర్గాలు వెల్లడించాయి. గతంలో ఇంజమామ్ ఉల్ హక్, యూనిస్ ఖాన్, మహ్మద్ యూసఫ్, జావెద్ మిందాద్ ఈ రికార్డు సాధించారు.