భారీగా బాలాపూర్ గణేష్ హుండీ ఆదాయం వెల్లడి
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధి చెందిన బాలాపూర్ వినాయక ఉత్సవాల హుండీ ఆదాయం మొత్తం రూ.28,11,999 వచ్చినట్లు ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కూడా హుండీ ఆదాయం భారీగా పెరిగినట్లు నిర్వాహకులు వెల్లడించారు. పదకొండ రోజులు భక్తుల పూజలు అందుకున్న ఏకదంతుడి శోభాయాత్ర అనంతరం నిమజ్జనం పూర్తి అయింది. ఆ తరువాత లెక్కింపు చేపట్టగా ఈ భారీ మొత్తం వెలుగులోకి వచ్చింది. స్వామివారిపై ఉన్న నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించినట్లు ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది.