మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డ బీఆర్ఎస్ నేత బత్తుల సుదర్శన్
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి మున్సిపల్ అధికారుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదరికం కారణంగా ఇల్లు కట్టుకుంటున్న మహిళకు భారీగా పెనాల్టీ విధించడం దారుణమని మాజీ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ మండిపడ్డారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. పేదల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు.