రూ.1700 కోట్లతో ముక్త్యాల-మచిలీపట్నం పోర్టు వాటర్వే ప్రాజెక్టు
రిపోర్టర్: రాము
స్థలం: కృష్ణా
రాష్ట్రంలోనే అతిపెద్ద భారీ జలమార్గం నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లా ముక్త్యాల నుంచి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం పోర్టు వరకు 168 కిలోమీటర్ల మేర రూ.1,700 కోట్ల వ్యయంతో భారీ వాటర్వే ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ మేరకు పీపీపీ, డీబీఎఫ్ఓటీ విధానంలో ప్రాజెక్టును చేపట్టేందుకు ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ బిడ్లను ఆహ్వానిస్తూ ఆర్ఎఫ్పీని విడుదల చేసిందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.