ఎన్నికల సంఘం తీరు దేశద్రోహంతో సమానమంటూ రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రాము
స్థలం: New Delhi
లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ విషయంలో భారత ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలు ఓట్ల దొంగతనంతో సమానమని, ఇది రాజ్యాంగ వ్యవస్థపై ప్రత్యక్ష దాడి అని ఆయన అభివర్ణించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్తో కలిసి ఈసీ దేశద్రోహానికి పాల్పడుతోందని ఆరోపించిన ఆయన, భవిష్యత్తులో అందరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.