విజయనగరం జిల్లాలో ముగిసిన పోస్టల్ ఓటింగ్: ఐదు వేలకు పైగా ఉద్యోగుల హక్కు
రిపోర్టర్: విజయ్
స్థలం: విజయనగరం
జడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు శుక్రవారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగిందన్నారు. ఇరవై ఏడు మండలాల పరిధిలో మొత్తం ఐదు వేల రెండు వందల ముప్పై ఒక్క మంది ఉద్యోగులు ఓటు వేసినట్లు జిల్లా ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.