కొయ్యూరు ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు తప్పిన ప్రమాదం

రిపోర్టర్: నేతల ప్రసాద్ బాబు స్థలం: కొయ్యూరు

కొయ్యూరు మండలంలోని చింతాలమ్మ ఘాట్లో గురువారం కొండచరియలు విరిగిపడి రహదారిపై మట్టి, రాళ్లు పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు సంభవించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి జేసీబీలతో మట్టిని తొలగిస్తున్నారు.