హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్ నిర్మిస్తున్న చిరంజీవి ఏషియన్ సునీల్

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరియు ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్ సంయుక్తంగా హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి హంగులతో భారీ సినిమా స్క్రీన్‌ను నిర్మిస్తున్నారు. ప్రారంభమైన వెంటనే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్లలో ఒకటిగా నిలవనుండటం విశేషం. తెలుగు సినీ ప్రేక్షకులకు సరికొత్త విజువల్ వండర్‌ను అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నాయి.