హోంగార్డు అభ్యర్థి మృతి కేసులో వెలుగులోకి సీసీటీవీ పుటేజ్
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: లక్నో
లక్నోలోని 35వ బెటాలియన్ పీఏసీ గ్రౌండ్లో హోంగార్డు రిక్రూట్మెంట్ ఫిజికల్ టెస్ట్ సమయంలో మృతి చెందిన 25 ఏళ్ల యోేంద్ర సింగ్ ఘటనకు సంబంధించిన సీసీటీవీ పుటేజ్ వెలుగులోకి వచ్చింది. పరుగు పందెంలో పాల్గొన్న యోేంద్ర సింగ్ ఒక్కసారిగా తూలి కిందపడిపోవడం, ఆ తర్వాత కాసేపు కూర్చుని మళ్లీ పరిగెత్తడానికి ప్రయత్నించి కుప్పకూలడం ఆ దృశ్యాలలో స్పష్టంగా కనిపిస్తోంది. పోస్టుమార్టంలో గొంతులో నీళ్ల బాటిల్ లభించడం, శరీరాలపై గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు హత్య ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరుపుతున్నారు.