'కెరీర్‌లోనే బెస్ట్ వర్క్': ది ప్యారడైజ్ పోస్ట్ ప్రొడక్షన్‌పై శ్రీకాంత్ ఓదెల
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కీలక దశకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో ఎడిటింగ్, డీఐ, డబ్బింగ్ పనులను డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దగ్గరుండి పర్యవేచిస్తున్నారు. దాదాపు 40 రోజులుగా ఇంటికి వెళ్లకుండా శ్రమిస్తున్న ఆయన, చెన్నైలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో కలిసి సంగీత పనులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. హీరో నాని సైతం ఈ వ్యవహారాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ టీమ్‌కు సహకారం అందిస్తున్నారు.