స్థానిక ఎన్నికల వేళ గ్రామాల అభివృద్ధికి కోటి చొప్పున నిధులు: సీఎం చంద్రబాబు

రిపోర్టర్: కిరణ్ స్థలం: నెల్లూరు

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రజల సమస్యల పరిష్కారానికి నియోజకవర్గానికి కోటి రూపాయల చొప్పున ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, గ్రామాల్లో చిన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలను ఆయన ఆదేశించారు.