ఆకుతోటపల్లిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆకుతోటపల్లి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. సర్పంచ్ న్యాలపట్ల నరేందర్ రెడ్డి సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలని ఆయన కొనియాడారు.

ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీనివాసు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ రామచందర్, మాజీ ఎంపీటీసీ నిట్ట నారాయణ తదితరులు పాల్గొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.