వందేభారత్ రైలులో సిగరెట్ తాగుతూ దొరికిపోయిన యువకుడు

రిపోర్టర్: సునీల్ స్థలం: India

జైపూర్ వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బాత్రూమ్‌లో ఒక యువకుడు సిగరెట్ తాగుతూ స్మోక్ డిటెక్షర్ ద్వారా అడ్డంగా దొరికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సెన్సార్ మోత మోగడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమై నిందితుడిని పట్టుకున్నారు. అయితే సదరు యువకుడు క్షమాపణ చెప్పడంతో టీటీఈ అతన్ని వదిలేశారు. వందేభారత్‌లో ఆధునిక భద్రతా వ్యవస్థలు ఉన్నందున సిగరెట్ పొగ వెంటనే గుర్తించబడుతుంది.