పోలీసు కార్యాలయానికి వచ్చే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఎస్పీ అజిత వేజెండ్ల స్పష్టీకరణ
రిపోర్టర్: వెంకట్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 181 ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్పీ అజిత వేజెండ్ల బాధితుల నుంచి అర్జీలను స్వీకరించి విచారణ జరిపారు. ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని ఆమె ఆదేశించారు.