అమెరికాలో ఘనంగా నందమూరి అందగాడు సంగీత కార్యక్రమం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమెరికా

అమెరికాలోని బోస్టన్లో సెప్టెంబర్ 26న తానా ఆధ్వర్యంలో నందమూరి అందగాడు సంగీత కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. తీవ్ర వర్షాలు మరియు వాతావరణ హెచ్చరికలను లెక్కచేయకుండా రెండు వందల మందికి పైగా ప్రేక్షకులు ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రముఖ గాయకుడు మధు చారి బృందం ఎన్టీఆర్ చిత్రాలలోని మధురమైన పాటలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు.