మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన స్మృతి మంధాన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: India
ఆసియా కప్ 2026లో భాగంగా హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కేవలం 64 బంతుల్లోనే 124 పరుగులు చేసి అరుదైన ఘనత సాధించింది. మూడు ఫార్మాట్లలో కలిపి 10,880 పరుగులు సాధించి, భారత దిగ్గజం మిథాలీ రాజ్ రికార్డును అధిగమించడమే కాకుండా, అంతర్జాతీయ క్రికెట్‌లో 18వ శతకంతో మహిళా క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించింది.