మైదుకూరు ఆసుపత్రిలో గాయపడిన కానిస్టేబుల్ చెన్నయ్యను పరామర్శించిన ఎస్పీ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: మైదుకూరు

వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న చాపాడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ చెన్నయ్యను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పరామర్శించారు. ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్ దాడిలో గాయపడిన కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితిని ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పోలీసుల సంక్షేమానికి తమ శాఖ ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.