అనంతపురం జిల్లాలో దారుణం: పాఠశాలలో విద్యార్థినిపై రంపంతో ఉన్మాది దాడి

రిపోర్టర్: కిరణ్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాఠశాల గదిలోకి చొరబడిన ఒక ఉన్మాది చెట్లు నరికే రంపం మిషన్తో పదో తరగతి విద్యార్థినిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘోర ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, ఉన్మాది సృష్టించిన బీభత్సంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉపాధ్యాయులు మరియు స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.