కళ్యాణపురంలో సైకిల్ గుర్తుకు ఓటేయాలని పోటెత్తిన టీడీపీ శ్రేణులు
రిపోర్టర్: AHMED
స్థలం: పొదలకూరు
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం కళ్యాణపురంలో టీడీపీ ఎంపీటీసి అభ్యర్థిని అన్నలూరు సుమలత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నవంబర్ ఐదున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి తనను, జెడ్పీటీసి అభ్యర్థి కలిచేటి ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు.