నవంబర్ నెలాఖరులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి నవంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో మంగళవారం పంచాయతీరాజ్ పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పాఠశాలల మరమ్మతులు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ కేంద్రాల పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు.