హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ నేత పెద్ది స్వప్న
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
హైదరాబాద్‌లో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావును వరంగల్ జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ కుటుంబ యోగక్షేమాలను ఆరా తీశారు. త్వరలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి నర్సంపేట నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి, స్థానిక రాజకీయ పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు.