'అధికారుల నిర్లక్ష్యం నశిచాలి': ఛాంబర్‌లోకి వీధి కుక్కలను వదిలిన యువసేన

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నిఫాడ్ నగర పంచాయతీ పరిధిలో పెరుగుతున్న వీధి కుక్కల బెడద, అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా యువసేన జిల్లా చీఫ్ విక్రమ్ రాంధవే నేతృత్వంలో కార్యకర్తలు తీవ్ర ఆందోళన చేపట్టారు. పురపాలక యంత్రాంగం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చీఫ్ ఆఫీసర్ ధీరజ్ భామ్రే ఛాంబర్‌లోకి ఏకంగా నాలుగు నుంచి ఐదు వీధి కుక్కలను వదిలారు. అంతేకాకుండా అధికారి టేబుల్‌పై కరెన్సీ నోట్ల దండను ఉంచి నిరసన తెలిపారు. వీధి కుక్కల నియంత్రణకు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.