పీఎంసేతు పథకంతో ఐటీఐల రూపురేఖలు మారనున్నాయి

రిపోర్టర్: హరి స్థలం: విజయనగరం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంసేతు పథకంతో ప్రభుత్వ ఐటీఐ కళాశాలల రూపురేఖలు మారనున్నాయి. ఒక్కో ఐటీఐకి రూ.40 కోట్ల నిధులు కేటాయించి అధునాతన యంత్రాలు, కొత్త కోర్సులతో శిక్షణ ఇవ్వనున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొలి విడతగా బొబ్బిలి ఐటీఐని ఎంపిక చేశారు. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్ది, శిక్షణ పూర్తయిన వెంటనే ఉపాధి కల్పించేలా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు.