స్థానిక ఎన్నికల్లో చంపడానికైనా చావడానికైనా సిద్ధం: ఎమ్మెల్సీ భరత్
రిపోర్టర్: గోపి
స్థలం: చిత్తూరు
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంపడానికైనా, చావడానికైనా సిద్ధపడే అభ్యర్థులను ఎంపిక చేస్తామని వైకాపా ఎమ్మెల్సీ కుప్పం ఇన్ఛార్జి భరత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో ఎన్నికల యుద్ధం ఖాయమని, రక్తంతో యుద్ధం చేయాలనుకుంటే రక్తాభిషేకం చేసైనా గెలుస్తామని హెచ్చరించారు. తెదేపా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలపై తెదేపా కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.