పిఠాపురంలో పీఠికాపుర వనాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రిపోర్టర్: రాము
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లా పిఠాపురంలో రూ.1.83 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన పీఠికాపుర వనాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. గతంలో డంపింగ్ యార్డుగా ఉన్న ఐదున్నర ఎకరాల ప్రాంతాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆకర్షణీయమైన నగర వనంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్యే పంతం నానాజీ తదితరులు పాల్గొన్నారు.