గూడూరు ఆసుపత్రికి ఐరన్ ర్యాక్‌లు విరాళమిచ్చి వివాహ వార్షికోత్సవం జరిపిన వైనం
రిపోర్టర్: sujith reddy
స్థలం: గూడూరు
గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. వాకాటి రామమోహన్ రావు తన కుమార్తె అల్లుళ్ల వివాహ వార్షికోత్సవం వేళ రెండు ఐరన్ ర్యాక్‌లను విరాళంగా ఇచ్చారు. రికార్డుల భద్రతకు ఉపయోగపడే వీటితో పాటు రోగులకు, సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా నిర్వాహకులు పిలుపునిచ్చారు.